WGL: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (FLNAT) రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వయోజన విద్య ఉపసంచాలకుడు తుమ్మ రమేశ్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 82,499 మంది ఈ పరీక్ష రాయనున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి NIOS సర్టిఫికెట్ అందజేయనున్నట్లు రమేష్ రెడ్డి వెల్లడించారు.