MLG: రైతు భరోసా డబ్బుల కోసం జరిగిన కుటుంబ గొడవ రక్తపాతానికి దారి తీసింది. ములుగు మండలం చింతలపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి డబ్బుల విషయంలో కుమార్ వాగ్వాదానికి దిగాడు. అడ్డుకున్న సతీశ్, రమేశ్‌పై కత్తితో దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. గ్రామస్తుల సమాచారం మేరకు 108 ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.