AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. కాసేపట్లో CM చంద్రబాబు ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశంపై ఇవాళ 4 గంటల పాటు చర్చ జరగనుంది. తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించాక.. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.