AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని తీర్మానించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ‘ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలకు ఈ సభ ప్రతీక. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే పవిత్ర యజ్ఞమిది. ఇందులో పాల్గొన్న భాగ్యం మనకు లభించింది’ అని పేర్కొన్నారు.