HYDలో ఏప్రిల్ 2న వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించనున్నట్లు బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ యాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై, కోఠి ఆంధ్ర బ్యాంకు కూడలి వరకు చేరుకుని, అనంతరం సికింద్రాబాద్ థర్డ్ బండ్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశముందని పేర్కొన్నారు.