పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ముదునూరుపాడులో 400 ఏళ్ల నాటి అతిపోరతన రామాలయంలో తరాలుగా రెండు దళిత కుటుంబాల వారే అర్చకత్వం నిర్వహిస్తున్నారు. వారే కళ్యాణ క్రతువు చేస్తుంటారు. శుక్రవారం సీతారాముల కళ్యాణ చేసి, శనివారం ఇదే ఆలయంలో క్షేత్ర పాలకునిగా గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఉదయం తెల్లవారు జామున ఊరేగింపు ఏర్పాటు చేశారు.