KRNL: పత్తికొండ మద్దికెర మండలం ఎం. అగ్రహారం గ్రామానికి చెందిన మాబున్ని (31) చికిత్స పొందుతూ మృతి చెందింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంజాన్ పండుగ సందర్భంగా పుట్టింటికి వెళ్తుండగా జరిగిన ఆటో ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లిందని పేర్కొన్నారు. వారం రోజులుగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు.