HYD: Greeny పేరుతో ఒక స్టార్టప్, IIT HYD సహకారంతో మొక్కజొన్న బయోపాలిమర్లతో నో-ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తయారు చేసింది. ఈ బ్యాగులు పర్యావరణహితంగా ఉండి అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. వినియోగం తర్వాత సుమారు 180 రోజుల్లోనే పూర్తిగా మట్టిలో కలిసిపోతాయని వెల్లడించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఇవి మంచి పరిష్కారంగా భావిస్తున్నారు.