»Tamil Producer Ravindar Who Did Not Lose Weight Actress Mahalakshmi Sensational Decision
Actress Mahalakshmi: బరువు తగ్గని రవీందర్..నటి మహాలక్ష్మి సంచలన నిర్ణయం
నటి మహాలక్ష్మి, ఓ సినిమా ప్రొడ్యూసర్ రవీందర్ ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి సమయంలో మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకున్నారని, అతని సంపద చూసి నటి పెళ్లికి సిద్ధమైందని పలువురు కామెంట్లు చేశారు. మరోవైపు మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పొందడానికి నిర్మాత రవీందర్ ఎన్నో ట్రిక్కులు చేశాడంటూ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇటివల అతను బరువు తగ్గే పరిస్థితి లేదని ఆమె కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
tamil producer Ravindar who did not lose weight Actress Mahalakshmi sensational decision
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్(Ravindar Chandrasekaran), నటి మహాలక్ష్మి(Mahalakshmi)ని వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరు చాలా మంది నుంచి ట్రోల్‌లను ఎదుర్కొన్నారు. చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న వీరిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. పెళ్లయ్యాక రవీందర్‌కి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఆయన అధిక బరువు…మహాలక్ష్మి సున్నితంగా ఉండడం. డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్‌ని పెళ్లి చేసుకుంది అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఈ జంట జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త గురించి వెల్లడించింది. తనను ఎక్కువగా బాధపెట్టిన దాని గురించి ఆమె బహిరంగంగా మాట్లాడింది. మా పెళ్లి సందర్భంగా చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేశారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు. అలాగే నా భర్త రవీందర్ బరువు(weight) ఎక్కువగా ఉండడంతో అతని కోసం నేను కూడా బరువు పెరగాలని ప్లాన్ చేస్తున్నాను. రవీందర్ బరువు తగ్గాలని ఎంత ప్రయత్నించినా కుదరదు.. అందుకే అతనిలా బరువు పెరగాలని ప్రయత్నిస్తున్నాను. నేను బరువు పెరగడానికి అధిక కొవ్వు పదార్థాలను కూడా తీసుకుంటానని చెప్పింది.
ఆ క్రమంలో తాను అర్ధరాత్రి కూడా చాలా ఆహారం తింటానని తెలిపింది. ఆ సమయంలో తనకు నిద్ర కూడా పోతుందని చెప్పింది. ఎలాగైనా తాను అతనిలా మారాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇకనైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయని అనుకుంటున్నానని సంచలన నిర్ణయం వెల్లడించింది. అయితే తన భర్త రవీందర్ జుట్టు నెరిసిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భర్త చెప్పాడని అంది. అయితే అందుకు అంగీకరించలేదని మహాలక్ష్మి తెలిపింది. ఎలాగైనా సరే త్వరలో బరువు పెరగాలనే ఆలోచనలో ఉందని మహాలక్ష్మి(Mahalakshmi) అంటోంది. ఇప్పుడు ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.