NZB: సిరికొండ మండలం చిన్న వాల్గోట్ గ్రామంలో సీతారామచంద్రస్వామి పల్లకి సేవ భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించిన పల్లకిలో అధిష్టింపజేసి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగుడుగునా మంగళ హారతులు పట్టి స్వామివారికి నీరాజనాలు అర్పించారు. భజనలు, రామనామ స్మరణలతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.