KMM: ముదిగొండ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సునీత ఎలిజిబెత్ ఖమ్మం కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో గతంలో కూసుమంచి తహసీల్దార్‌గా పనిచేసిన రవి ముదిగొండ కొత్త తహసీల్దార్‌గా నియమితులయ్యారు. రెవెన్యూ విభాగంలో జరిగిన ఈ మార్పులతో త్వరలోనే వారు తమ బాధ్యతలను స్వీకరించనున్నారు.