SRD: మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్ తండాలో లబ్ధిదారుడు ఖీరు పవార్ నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం శుక్రవారం ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ మాక్స్ రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. పేదల ఇళ్ల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సొంతింటి కల నెరవేరినందుకు లబ్ధిదారుడు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.