ADB: రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జి పనులను ఆపేందుకు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. స్థానిక నాయకులతో కలిసి పట్టణంలో కొనసాగుతున్న రైల్వే బ్రిడ్జి పనులను శుక్రవారం MLA పరిశీలించారు. అభివృద్ధి పనులు పూర్తి అయ్యేవరకు జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.