MNCL: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మందమర్రి శుక్రవారం శ్రీరాముడి పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ పల్లకి సేవ స్థానిక మేదరిబస్తీ నుంచి బస్టాండ్ మీదుగా శివాలయం వరకు సాగింది. హనుమాన్ మాలాధారులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనగా శ్రీరామ నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.