నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన వాల్మీకి నగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణం తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేశారు.