VZM: ద్రవ జీవామృతం ద్వారా భూముల్లోని నిద్రావస్థల్లో ఉన్న సూక్ష్మజీవులను ఉత్తేజపరచవచ్చని ప్రకృతి వ్యవసాయ శాఖ ఎఫ్ఎమ్టీ కళావతి తెలిపారు. శుక్రవారం మెరకముడిదాం గ్రామంలో గణేష్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ద్రవ జీవామృతం తయారు చేశారు. దీని ద్వారా భూమి ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు పంట కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.