IPL-2026 ఆరంభ మ్యాచ్‌లో RCB, SRH జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ కీలక పోరులో RCB స్టార్ పేసర్ జోష్ హెజెల్‌వుడ్ బరిలోకి దిగడం లేదని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశాడు. గాయం నుంచి కోలుకుని నిన్ననే జట్టుతో చేరినప్పటికీ, అతనికి మరింత విశ్రాంతి అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ అందుబాటులో లేకపోవడం RCB బౌలింగ్‌కు పెద్ద ఎదురుదెబ్బే.