WGL: నర్సంపేట పట్టణంలోని కనకదుర్గామాత దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ రామానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.