JGL : మల్లాపూర్ మండలం వాల్గొండ, సిర్పూర్ గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.. సతీమణి దీప్తితో కలిసి హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల ఆశీస్సులు పొందిన అనంతరం, ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.