E.G: చాగల్లు మండలం దారవరంకి చెందిన లకంసాని బిందు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. టీడీపీ సభ్యత్వం తీసుకున్న ఆమెకు భీమా పథకం కింద మృతురాలి తండ్రి కోటారు శ్రీనివాసరావుకూ రూ.5 లక్షల భీమా పత్రాన్ని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వర రావు చేతుల మీదుగా ఇవాళ అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తామన్నారు.