ATP: గుత్తి కోటలోని అతి పురాతనమైన కోటా రామాలయంలో ఇవాళ శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గుంతకల్ MLA గుమ్మనూరు జయరాం, గుత్తి, పామిడి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.