నిజామాబాద్ నగరంలోని హమాల్వాడిలో ఉన్న శ్రీ సంతోషిమాత సాయి బాబా దేవాలయంలో శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు సాయిబాబాకు అభిషేకం చేశారు. అనంతరం ఉదయం 7:45 గంటలకు ధ్వజారోహణం, ఉదయం 8 గంటలకు డోలారోహణం, శ్రీ సాయిబాబా జన్మదిన వేడుకలు జరిపారు.