SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో జరుగుతున్న సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం కోసం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడకు చేరుకున్నారు. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.