MDCL: ఉప్పల్, మల్లాపూర్, కుషాయిగూడ ప్రాంతాల్లో నిషేధిత గుట్కా, అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసులతో కలిసి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ గుట్కా నిల్వలు, అక్రమ మద్యం సరఫరాను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.