ప్రకాశం: కంభం మండలం రావిపాడు గ్రామంలో మట్టి పరీక్షల ఉపయోగాలు, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులపై మండల వ్యవసాయ అధికారి దేవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపూరం ఏడీఏ బాలాజీ నాయక్ పాల్గొని మట్టి పరీక్షల ఉపయోగాలు, సమగ్ర పోషక యజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.