TG: మంత్రి సీతక్క వ్యాఖ్యలకు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ‘నన్ను దొరసాని అనడం ఏంటి? వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపడం తప్పా?’ అని ప్రశ్నించారు. వారం రోజులుగా నీళ్లు రావడం లేదని ప్రజలు చెబుతుంటే మాట్లాడకూడదా అని అడిగారు. CM రేవంత్ సంతోషం కోసమే తనను, KCRను విమర్శిస్తున్నారా అని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని హితవు పలికారు.