NZB: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం హజ్ యాత్రికులకు ముందస్తు వ్యాధి నిరోధక టీకాల పంపిణీని DM&HO డాక్టర్ రాజశ్రీ ప్రారంభించారు. మొత్తం 320 మందికి టీకాలు వేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, హజ్ కమిటీ అధ్యక్షుడు మౌలానా షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొని యాత్రికులకు అవగాహన కల్పించారు.