TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఏప్రిల్ 8 వరకు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్కు రిమాండ్ పొడిగిస్తూ.. తీర్పునిచ్చింది. ఈ క్రమంలో నిందితులను పోలీసులు వేధించారా? అని జడ్జి ప్రశ్నించారు. అందుకు అలా ఏమీ చేయలేదని నిందితులు తెలిపారు.