WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి గురువారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. పత్తి ధర క్వింటాకి రూ.7,500, మక్కలు(బిల్టీ)కి రూ.2,100 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయ రూ.8,390, పచ్చి పల్లికాయ రూ.4,900 ధర పలికాయి. సింగల్ పట్టి రకం మిర్చి రూ.33 వేలు, టమాటా మిర్చి రూ.37 వేలు ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.