PLD: నిత్యావసరాల కొరతతో సామాన్యుడి బతుకు ఛిద్రమవుతోంది. యుద్ధంతో వంట గ్యాస్, ఇంధనం దొరక్క వినియోగదారులు విలవిలలాడుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు పనులు మానుకుని గంటల తరబడి వద్ద క్యూలైన్లలో వేచిచూడాల్సి వస్తోంది. బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు, గ్యాస్ ఆఫీసుల ముందు బారులు తీరుతున్న బండ్లు సామాన్యుడి కష్టాలకు నిదర్శనంగా మారుతున్నాయి.