PLD: రాజుపాలెం మండలంలో ఇంటి పన్నుల వసూళ్లను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఎంపీడీవో శ్రీనివాసరావు ఆదేశించారు. మొత్తం రూ.86.96 లక్షల పన్నులకు గాను, ఇప్పటివరకు రూ.83.07 లక్షలు వసూలయ్యాయన్నారు. ఇంకా రూ.14.39 లక్షల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. మండల అభివృద్ధికి పన్నులే కీలకమని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు.