VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సోదరులు, ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమన్న శెట్టి నిన్న స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ మేరకు జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం వారి నివాసానికి చేరుకుని తమన్న శెట్టి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి తీరని లోటని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.