MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మార్కెట్ యార్డ్‌లోని మండల స్థాయి నిల్వ (MLS) కేంద్రాన్ని అధికారులతో కలిసి తనిఖీ చేశారు. గిడ్డంగిలోని నిత్యావసరాల నిల్వలు, నాణ్యత, సరఫరా రికార్డులను ఆమె సమీక్షించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రేషన్ సక్రమంగా అందేలా చూడాలని, స్టాక్ పంపిణీలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.