కామారెడ్డి: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో నాటు బాంబు పేలిన ఘటన కలకలం రేపింది. మేతకు వెళ్లిన గేదె ఆహారంతో కలిపి ఉంచిన నాటు బాంబును కొరకడంతో అది ఒక్కసారిగా పేలి దవడ భాగం తీవ్రంగా దెబ్బతింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో మరికొన్ని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన గేదెకు పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు.