GNTR: వెంకటపాలెం యూనియన్ బ్యాంకులో కస్టమర్లు దాచుకున్న బంగారం మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 328 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్లు ఈ నెల 2న బ్యాంకు మేనేజర్ గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఒక మహిళా ఉద్యోగి లాకర్ నుంచి రెండు పౌచ్‌లను బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.