MBNR: నవాబ్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా మెడికల్ క్యాంపును డా.శ్రావణ్ కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గీతా రాణి ఘనంగా ప్రారంభించారు. డాక్టర్లు భరత్, భావన, దివ్య, శ్వేత, నూర్, ప్రణవి కలిసి మొత్తం 943 మందికి పరీక్షలు నిర్వహించగా 131 మందిని రిఫర్ చేశారు. 21 రక్త పరీక్షలు, 24 ఎక్స్‌రేలు 6, టీబీ 5 పాప్ స్మియర్ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.