SRCL: తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన జానపద కళాకారిణి కోల స్నేహకు హైదరాబాద్ రవీంద్రభారతిలో పీపుల్స్ మీడియా పాయింట్ సంస్థ ‘శివంగి ఆత్మీయ పురస్కారం’ అందజేసింది. వందకుపైగా జానపద పాటలు రాసి పాడిన ఆమె, “అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి” పాటతో మంచి గుర్తింపు పొందారు. భర్త వినయ్ కుమార్, తల్లిదండ్రులు విజయ-మల్లేశం తన విజయానికి సహకారమని తెలిపారు.