MBNR: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించి, ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.