చాలా మంది తమ జీవితంలో కొన్ని తప్పులు చేయడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చెడుకాలం వచ్చినప్పుడు మనిషి ఏ పని చేసినా అందులో వైఫల్యం చెందడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటం, వ్యాధులు, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతుంటాయి. ఈ నష్టాల వెనక కొన్ని చెడు అలవాట్లే కారణం అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చే కొన్ని చెడు అలవాట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోళ్లు కొరికే అలవాట్లు మానుకోవాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గోర్లు కొరికే వారికి అనేక రకాల దోషాలు తలెత్తుతాయి. గోర్లు కొరికే అలవాటు వల్ల ఆ వ్యక్తి జీవితంలో సూర్యుడు బలహీనమవుతాడు. ఆ వ్యక్తి సంపద, గౌరవం, పరువు పోయే సందర్భాలు ఏర్పడుతాయి.
నేలను రాస్తూ నడిచే నడక కూడా మంచిది కాదు. జ్యోతిషశాస్త్రంలో నేలను రాస్తూ నడిచే అలవాటును చెడ్డదిగా పరిగణిస్తారు. ఈ అలవాటున్నవారు వైవాహిక జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. దంపతుల మధ్య తురచూ గొడవలు జరుగుతుంటాయి.
బూట్లు, చెప్పులను చాలా మంది ఇళ్లలో ఎక్కడబడితే అక్కడ వదిలేస్తుంటారు. బూట్లు చెల్లాచెదురుగా ఉన్న ఇళ్లలో దురదృష్టం తాండవిస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అలాగే బూట్లు, చెప్పులు మురికిగానే వాడుతుంటే వారు సంపదను కోల్పోయే ప్రమాదం ఉందని జ్యోతిషశాస్త్రం తెలుపుతోంది.
ఇంట్లో అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి నివసించదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇంటి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా వంటగదిలో పాత్రలు సింక్ లో చెల్లాచెదురుగా ఉంచడం లక్ష్మి దేవికి అస్సలు నచ్చదట. అందుకే ఇంటిని, వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ అలవాట్లు మార్చుకోకుంటే లక్ష్మీదేవిని కోల్పోయే ప్రమాదం ఉందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.