ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీస్ అధికారులతో బుధవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హత్య కేసులు, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమన్, ప్రాపర్టీ కేసులు, పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు.