BDK: వాహనదారులకు రోడ్డు నిబంధనలపై ఆశ్వారావుపేట సీఐ పింగళి నాగరాజు రెడ్డి, ఎస్సై యయాతి రాజు అవగాహన కల్పించారు. రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్- ఫేజ్ 2’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.