AP: విజయనగరం జిల్లా రామతీర్థంలో రూ. 3.4 కోట్లతో నిర్మించిన గిరిప్రదక్షిణ మార్గాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ కూడా వర్చువల్గా పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం, పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా ఈ రహదారిని నిర్మించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.