MDK: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఎస్ఎఫ్ఐ తూప్రాన్ డివిజన్ అధ్యక్షులు కార్తీక్ పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలపై చలో అసెంబ్లీ పిలుపునిస్తే ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తూప్రాన్ పోలీసులు డివిజన్ అధ్యక్షులు కార్తీక్, నాయకులు రమేష్, పోచయ్యలను ముందస్తు అరెస్టు చేశారు. నిర్బంధాలు, అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని SFI నాయకులు పేర్కొన్నారు.