AP: పట్టణాల్లో ఉద్యోగం చేసే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వసతి, భద్రత కోసం ‘సఖి నివాస్’ పేరిట 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయనుంది. ఒక్కో హాస్టల్లో 30 మందికి వసతి కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగినులు, విద్యార్థినులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం, వసతి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. సొంత ఊళ్లకు దూరంగా ఉండేవారికి ఇది మంచి అవకాశం.