CTR: కుప్పం మున్సిపాలిటీ తంబిగానిపల్లి SC కాలనీ అంగన్వాడీ కేంద్రంలో కుక్కర్ పేలి అంగన్వాడీ కార్యకర్త సుమతి గాయపడ్డారు. మధ్యాహ్నం వంట చేసేందుకు స్టవ్ మీద కుక్కర్ పెట్టారు. కాసేపు తర్వాత కుక్కర్ విజిల్స్ రాగా స్టౌ ఆఫ్ చేసి కుక్కర్‌ను పక్కకు తీసి దాన్ని ఓపెన్ చేసే క్రమంలో పేలడంతో కుక్కర్లోని వేడి నీళ్లతో పాటు పప్పు ఆమె ముఖంపై పడింది.