28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ను 30 రోజులకు మార్చాలని టెలికాం సంస్థలకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ‘ఏడాదికి 13 సార్లు రిఛార్జ్ ఎందుకు’ అంటూ AAP MP రాఘవ్ చద్దా రాజ్యసభలో ప్రశ్నించిన నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. అటు రీఛార్జ్ చేయకున్నా ఇన్కమింగ్ కాల్స్ ఆపకూడదని, మిగిలిపోయిన డేటాను తర్వాతి రోజు వాడుకునే ఛాన్స్ ఇవ్వాలని చద్దా కోరారు.