Sirasri: వ్యూహం సినిమాతో ఎవరికి లాభం ఎవరికీ నష్టం?
ప్రముఖ రైటర్ సిరాశ్రీ తన సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే ఆ వివరాలు ఏంటి? ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
Sirasri: సర్వం శక్తిమయం అనే సినిమాలో దేవుడిని, సైన్స్‌ను ఏ విధంగా కలిపామనే కాన్సెప్ట్‌ను తానే డెవలప్ చేసినట్లు ప్రముఖ రైటర్ సిరాశ్రీ(Sirasri) వెల్లడించారు. మొదట ఆ సినిమా స్టోరీ డిస్కషన్లో పాల్గొన్నానని, తరువాత దానికోసం సంస్కృతంలో ఓ పాట రాసినట్లు తెలిపారు. ఇక బిగ్ బాంగ్ థియరీని గాడ్ కాన్సెప్ట్‌కు కనెక్ట్ చేసిన విధానం ఎంతో ఆసక్తిగా చెప్పారు. ప్రస్తుతం రచయితగా ఉన్నా తాను భవిష్యత్తులో ఏం అవుతారో చెప్పారు. దాని కోసమే నిత్యం శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసినా కమర్షల్ సినిమాల్లో ఎందుకు రాయలేదో తెలిపారు. చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళాశంకర్ చిత్రంలో ఆయన పాట రాసినట్లు చెప్పారు. కానీ ఆ పాట ఎందుకు ఆ చిత్రంలో లేదో పేర్కొన్నారు. ఓటీటీ వలన సినిమాలకు ఏలాంటి నష్టాలు కలుగుతాయో వివరించారు. ఇలాంటి ఎన్నో ఆసక్తిరమైన విషయాలకు చక్కని సమాధానాలు చెప్పారు. మరి ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి మరి.