TG: పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు దిగుమతులు నిలిచిపోవడంతో HYDలో ఇంధన సంక్షోభం నెలకొంది. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు, ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రవాణా కష్టాలు పెరగడంతో ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇంధన, గ్యాస్ కొరత నేపథ్యంలో తమకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్'(WFH) అవకాశం ఇవ్వాలని కంపెనీలను కోరుతున్నారు.