GDWL: వడ్డెరల హక్కుల కోసం చేసే పోరాటాన్ని పోలీసుల ద్వారా అనిచి వెయ్యాలనుకోవడం ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అని అయిజ వడ్డెర నాయకులు మేస్త్రి వీరేష్, వడ్డే వీరేష్ అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను అయిజ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.