VZM: జిల్లాలో కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ విభాగ అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో జీవనరాణి పాల్గొన్నారు.